గవర్నర్‌ను రికాల్ చేయండి: రాష్ట్రపతికి బిజెపి నేతల వినతి

భూకుంభకోణాలకు సంబంధించిన తాజాగా సోమవారం యడ్యూరప్పపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇవే ఆరోపణలపై యడ్యూరప్ప మీద గత వారం రెండు కేసులు నమోదయ్యాయి. తాను కూడా భరద్వాజ్‌పై కేసు నమోదు చేస్తానని యడ్యూరప్ప సోమవారం చెప్పారు. అయితే, అది ఏ విధమైన కేసు అనేది ఆయన చెప్పలేదు. కర్ణాటకలో పరిస్థితిని వివరించడానికి యడ్యూరప్ప ఆదివారం బిజెపి అగ్రనేతలను ఢిల్లీలో కలిశారు. తన కుమారుడికి అనుకూలంగా ముఖ్యమంత్రి భూములను డీనోటిఫై చేయడం అనైతికమని, సరైంది కాదని చైనా పర్యటనలో ఉన్న బిజెపి అధ్యక్షుడు గడ్కరీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు.
గడ్కరీ వ్యాఖ్యలపై మాట్లాడడానికి యడ్యూరప్ప నిరాకరించారు. తమ పార్టీ జాతీయాధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ఏమీ మాట్లాడ దలుచుకోలేదని, తాను గడ్కరీతోనే మాట్లాడుతానని ఆనయ చెప్పారు. భూ కేటాయింపుల్లో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications