తెరాసపై మండిపడ్డ డి. శ్రీనివాస్, దౌర్జన్యం చేస్తారా అని నిలదీత

రాళ్లు రువ్వడం గాంధేయవాదమా అని ఆయన అడిగారు. రచ్చబండలో పాల్గొంటున్న నాయకులపై తెరాస కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వరంగల్ జిల్లాలో మంత్రి సారయ్య, పార్లమెంటు సభ్యుడు రాజయ్యలపై తెరాస కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న కాంగ్రెసు నాయకులపై కూడా తెరాస కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం, తెరాస కార్యక్రమాలను అడ్డుకోవద్దని ఆయన కాంగ్రెసు కార్యకర్తలకు సూచించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కార్యక్రమాన్నిఅడ్డుకోవద్దని జగ్గారెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications