తెలంగాణలో రచ్చబండ రచ్చరచ్చ: మంత్రులకు పరీక్షా కాలం

నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం అక్బర్‌బాగ్‌లో వరంగల్ జిల్లా జనగామ మండలం నెల్లికుదురులో పలువురు తెలంగాణవాదులు రచ్చబండను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆమ్డాపూర్‌లో మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి అడ్డుకుంది. జెఏసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆహార భద్రత, రేషన్ కార్డుల విషయమై సిపిఐ, జగన్ వర్గం నిలదీసింది. కరీంనగర్ మహాముత్తారం మండలం యామినిపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా పల్లెపహాడ్‌లో పోలీసులకు, తెలంగాణవాదులకు తోపులాట జరిగింది. నగరంలోని 31వ వార్డులో తెలంగాణవాదులు కుర్చీలు విరగ్గొట్టారు. మెదక్ జిల్లా నందలూరులో తెలంగాణ బిల్లు పెట్టాలని ముదిరాజ్ సంఘాలు ధర్నా నిర్వహించాయి.
మెదక్ జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిలపై పలువురు తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆదేశంతో నల్గొండ చివ్వెంలలో గ్రామస్తులు రచ్చబండను అడ్డకున్నారు. కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ మండలం మోహినికుంటలో గ్రామస్తులు రోకలి బండతో వెళ్లారు. మొత్తానికి రచ్చబండ కార్యక్రమాన్ని టిఆర్ఎస్, బిజెపి, టిడిపిలతో పాటు సొంత పార్టీ వారే కొందరు అడ్డుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications