వైఎస్‌పై కామెంట్స్‌పై రిపీట్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి

ముఖ్యమంత్రి ఇటీవలే రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అండతో వైఎస్ ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి పలుమార్లు ఈ వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ వల్లే వైఎస్ ఆ స్థాయికి ఎదిగారనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అండ ఏం చేయలేరనే విషయాన్ని ప్రజలకు స్ఫష్టం చేయదలుచుకున్నారు. వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు సొంత పథకాలు కాదని, అవి కాంగ్రెస్ పథకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం సంక్షేమ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలను ముఖ్యమంత్రి పక్కా వ్యూహంతో తిప్పికొడుతున్నట్టుగా తెలుస్తోంది.
పథకాలను వైఎస్ ప్రవేశ పెట్టినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం ఆ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెడితే పార్టీకి కొంత నష్టం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి పలుమార్లు అవి పార్టీ పథకాలుగా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications