చరిత్ర చూడండి: కెసిఆర్‌పై మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి ఫైర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావుపై మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి ఆదివారం, తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలపైనా కేసిఆర్ వ్యాఖ్యలు శోచనీయమని మంత్రి దానం నాగేంద్ర అన్నారు. ప్రజలను ఎవరు రెచ్చగొడుతున్నారో చరిత్ర చూస్తే అందరికీ తెలుస్తుందని అన్నారు.

ఇంతవరకు నిధులు ప్రకటించి జనంలోకి వెళ్లిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక్కరికే దక్కిందన్నారు. రచ్చబండను పేదలెవరూ అడ్డుకోలేదన్నారు. కేవలం పది, ఇరవై మంది వచ్చి అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం ప్రజలకు చేయాలనుకున్న మంచిని చేయకుండా ఊరుకోదన్నారు. కొన్నిచోట్ల రచ్చబండను అడ్డుకుంటే పేదలే వారిని తరిమికొట్టారన్నారు.

కోడిగుడ్లు విసిరి రచ్చబండను అడ్డుకున్నంత మాత్రాన ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని ప్రభుత్వం ఆపేది లేదని మరో మంత్రి గీతారెడ్డి అన్నారు. కోడిగుడ్లు విసరడం, అభివృద్ధి పనులు ఆపడం సరికాదన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉన్నాయన్నారు. కెసిఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+