వైయస్ జగన్ కోటలో కిరణ్ పాగా, 11న కడపలో రచ్చబండ

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కడప కోటలో పాగా వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 11వ తేదీన కడపలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కడప రచ్చబండ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. రచ్చబండ కార్యక్రమంపై సోమవారం కడప జిల్లాకు చెందిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి జిల్లా నాయకులతో చర్చించారు.

ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లపై డిఎల్ రవీంద్రా రెడ్డి ఆ జిల్లా నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+