జగన్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం కూలే పరిస్థితి: ఎంపీ సబ్బం హరి

Sabbam Hari
ఏలూరు: జగన్‌ను రాజీవ్‌గాంధీతో, విజయమ్మను ఇందిరాగాంధీతో ఎంపీ సబ్బం హరి పోల్చారు. సాక్షిని, జగన్‌ను విమర్శిస్తున్న వారు రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం అదే సాక్షి అని మరిచి పోతున్నారన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉండాలని చెప్పానని, అయితే జగన్ లేకుంటే కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని గతంలో చెప్పానని ఇప్పుడు అలాగే అయిందన్నారు. జగన్‌ను నిర్లక్ష్యం చేయటం వల్ల కేంద్రంలో కూడా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందన్నారు.

పోలవరంకు జాతీయ హోదా వస్తుందని ఆరునెలల్లో ఆరుసార్లు వస్తుందని చెప్పారని, అయితే ఇప్పటి వరకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రానికి రాష్ట్రంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తాననడానికి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి హక్కు లేదన్నారు. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రాయాస పడిన డిఎల్ జగన్‌కు ఆఫర్ ఇవ్వడమా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+