రెచ్చగొట్టిన కావూరి: తెలంగాణ నేతల రాజీనామా సవాళ్లు

పదవి లేకుండా తెలంగాణ నేతలు ఉండలేరని ఆయన విమర్శించారు. నలుగురి పేర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేతలు సేఫ్‌గా ఉండి, సామాన్యులను బలి పశువులను చేస్తున్నారని ఆయన అన్నారు. కావూరి సాంబశివ రావుపై తెలంగాణ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కావూరి సాంబశివరావు భావ వ్యక్తీకరణ ఎలా చేశారో, తెలంగాణ లాయర్లకు కూడా అదే స్వేచ్ఛ ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర తెలంగాణకు ఉందని ఆయన అన్నారు.
టోల్‌గేట్ వసూలు చేసే సంప్రదాయం వారిదని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అడ్డు పడింది కావూరి సాంబశివరావు అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము రాజీనామాలు చేస్తామని, సమైక్యవాదాన్ని కోరుతున్నవారు రాజీనామా చేయాలని, పోటీ చేద్దామని, ఎవరు గెలుస్తామో చూద్దామని ఆయన అన్నారు. కెసిఆర్, నరేంద్ర రాజీనామాలు చేశారని, శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. రేపే స్పీకర్‌కు రాజీనామాలు రేపే ఇద్దామని ఆయన సవాల్ చేశారు.
కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా మండిపడ్డారు. కావూరి వ్యాఖ్యల వల్లనైనా నిజాలు తెలుసుకుని కాంగ్రెసు శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడాలని ఆమె వరంగల్‌లో అన్నారు. మొదటి రాజీనామా తానే చేస్తానని ఆమె అన్నారు. సమైక్యావాదం కావాలని అంటున్నవాళ్లంతా రాజీనామాలు చేయాలని, తెలంగాణ కావాలంటున్న తాము రాజీనామా చేస్తామని, తిరిగి పోటీ చేద్దామని, అందుకు సిద్ధపడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కావూరి సాంబశివరావుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications