హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ భూకేటాయింపులపై రగడ, అసెంబ్లీ రెండుసార్లు వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై గురువారంనాడు కూడా శాసనసభలో రగడ చోటు చేసుకుంది. భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. మరో వైపు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ స్థితిలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రెండు సార్లు వాయిదా వేశారు.

మొదట శాసనసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను ఉపసభాపతి తిరస్కరించారు. ప్రభుత్వ భూముల పందేరంపై శాసనసభా సంఘం వేయాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభను ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ అరగంట వాయిదా వేశారు. అరగంట వాయిదా తర్వాత ప్రారంభమైన శాసనసభ మరోసారి అరగంట వాయిదా పడింది. సభలో తెలుగుదేశం పార్టీ భూపందేరాలపై చర్చకు పట్టువీడలేదు. దాంతో ఉపసభాపతి సభను వాయిదా వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కి రావాలని ఆయన కోరారు.

English summary
Assembly adjourned twice, as TDP MLAs stalled the proceedings on land allocation issue. TDP MLAs demanded for house committee on land allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X