శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్రకు అమ్ముడు పోయింది: హరీష్ రావు

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఏం జరిగినా మా బాధ్యత లేదన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని తప్పులను పూసగుచ్చినట్లు చెప్పిందన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం కూడా కమిటీ నివేదిక తప్పుల తడకను బయట పెట్టిందన్నారు. నివేదికలో తెలంగాణ ప్రజల మనోభావాలు కనిపించలేదన్నారు.
సీమాంధ్ర పెట్టుబడిదారులకు శ్రీకృష్ణ కమిటీ అమ్ముడు పోయిందన్నారు. సీమాంధ్రులకు అమ్ముడు పోయిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇంతటితో వదిలేసిది లేదన్నారు. వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో అన్ని తప్పులే అని హైకోర్టు వ్యాఖ్యలతో తెలిసిందన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెసులో విలీనం అయ్యే ప్రసక్తి లేదన్నారు.
Comments
harish rao srikrishna committee telangana congress hyderabad హరీష్ రావు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
TRS senior MLA Harish Rao said today that Srikrishna Committee report is seemandhra report. He opposed TRS merger in Congress.
Story first published: Thursday, March 24, 2011, 12:40 [IST]