వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రపంచంలో ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రజలు ఎవరో తెలుసా..?

30 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని ఫేస్‌బుక్ యూరప్ వైస్-ప్రెసిడెంట్ జొయన్నా షీల్డ్ చెప్పారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానం చూరగొని ప్రస్తుతం 500 మిలియన్‌ల సభ్యులను కలిగి ఉంది.
సగం మంది సభ్యులు ఒక నెలలో 700 బిలియన్ నిమిషాలు పాటు ఈ సైట్‌తో అనుసంధానమవుతున్నారు. ఇది 1.3 మిలియన్ సంవత్సరాలకు సమానం. ఇందులో ప్రతి సభ్యుడు సగటున 130 మిత్రులను సంప్రదిస్తున్నారు. అలాగే, నెలకు 90 ఐటమ్స్‌ను వీరు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్నారు.