వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో చిరంజీవి హవా: పోలీసుల లాఠీచార్జీ, 20 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
బెంగళూరు: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హవా కర్ణాటక రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. కర్ణాటకలోని బంగారుపేటకు కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన చిరంజీవిని చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. కారు నుంచి దిగుతున్న సమయంలో పెద్ద యెత్తున అభిమానులు ఒక్కసారిగా చిరంజీవిని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేయక తప్పలేదు. కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.

ఢిల్లీలోని కాంగ్రెసు అధిష్టానం తనను ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడిగా కాకుండా జాతీయ స్థాయి నాయకుడిగా భావిస్తోందని, అందువల్లనే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించాల్సిన బాధ్యత తనపై పెట్టిందని ఆయన తన ఎన్నికల ప్రచారంలో అన్నారు. అందరికీ నమస్కారం అని కన్నడంలో తన ప్రసంగాన్ని చిరంజీవి కన్నడంలో ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు తెలుగులో ప్రసంగించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై ఉంచిన నమ్మకానికి ప్రతిగా కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించి తనకు బహుమానంగా ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. చిరంజీవి ఎన్నికల ప్రచార సభకు మంచి స్పందన లభించింది.

English summary
Fifteen students were among 20 people injured when police baton-charged a crowd during an election campaign by megastar Chiranjeevi at Bangarpet in this Karnataka district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X