రాజీపడితే కేంద్ర మంత్రి పదవి వచ్చేది: వైయస్ జగన్మోహన్ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన వైయస్ రాజశేఖరరెడ్డి పెంపకంలో తాను రాజీ పడటం నేర్చుకోలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. రాజీపడటం నాకు తెలియదన్నారు. కాంగ్రెసు పార్టీతో రాజీ పడితే తనకు పెద్ద పదవులు వచ్చేవన్నారు. కానీ తాను రాజీపడకుండా ప్రజల పక్షాన నిలవడానికే నిర్ణయించుకున్నానని చెప్పారు.
విశ్వసనీయత, సచ్ఛీలతలను పక్కన పెట్టకుంటే కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చేవి కావని జగన్ అభిప్రాయ పడ్డారు. కాగా ఉప ఎన్నికలలో భాగంగా జగన్ కడప జిల్లాలో తన ప్రచార యాత్రను శుక్రవారం కూడా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకు పడ్డారు.
Ex MP YS Jaganmohan Reddy fired today at Congress party today in his campaign. He said he did not know about compromise. He said his father was not told him about compromise.
Story first published: Friday, April 8, 2011, 14:29 [IST]