వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ దొంగలను ఇక మీదట పట్టుకోవడం చాలా సులువు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mobile Theft
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే అది ఎక్కడుందో కనిపెట్టడం మరింత సులువు కానుంది. జాతీయ టెలికాం పాలసీ(ఎన్‌టీపీ)-2011లో భాగంగా వేల్యూ యాడెడ్ సర్వీసెస్(వ్యాస్) ప్రొవైడర్లకు సెల్‌ఫోన్ లొకేషన్ సమాచార యాక్సెస్‌ను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుండడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్రం అధ్యయనం చేస్తోంది. అనుమతి గనుక లభిస్తే... పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం, దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్ల లొకేషన్‌ను ట్రాక్ చేయడం వంటివన్నీ వ్యాస్ సేవల రూపంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

మొబైల్ హ్యాండ్‌సెట్‌లో జీపీఎస్ ఆధారిత సదుపాయం లేకపోయినా సరే వెబ్ అప్లికేషన్‌లో సంబంధిత మొబైల్ నంబర్‌ను ఫీడ్ చేయడం ద్వారా చిటికెలో లొకేషన్ సమాచారాన్ని అందుకునే అవకాశం లభిస్తుంది. 'ఎన్‌టీపీ-2011లోని కంటెంట్ ఎనేబుల్‌మెంట్ కింద లొకేషన్ బేస్డ్ సేవల(ఎల్‌బీఎస్)కు వీలు లభించనుంది. వేల్యూ యాడెడ్ సేవలు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమైన అంశంగా నిలవనుంది" అని టెలికాం విభాగం(డాట్) కార్యదర్శి ఆర్.చంద్రశేఖరన్ చెప్పారు.

English summary
The first NTP was formed in 1994, where only two private telecom companies were permitted per telecom circle to provide mobile telephony services with GSM technology. However, this original policy was reviewed in 1999, thus permitting more players in each circle. Also there was a restructuring of Telecom Regulatory Authority of India (TRAI)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X