వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మో... ఆ మంత్రుల మధ్య తలదూర్చకూడదు!: పిసిసి ఛీప్ నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

D srinivas
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు డికె అరుణ, జూపల్లి కృష్ణారావుల మధ్య తలదూర్చకూడదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ స్వాభిమాన్ పాదయాత్ర చేస్తున్నట్టే తాను మంత్రి డికె అరుణ నియోజకవర్గం గద్వాలలో చేస్తున్నట్టు జూపల్లి కృష్ణారావు చెబుతున్నారు. అయితే ఆధిపత్యం కోసమే జూపల్లి యాత్ర చేస్తున్నారని ఎలాంటి పరిస్థితులలో తన నియోజకవర్గంలో చేయనిచ్చేది లేదని డికె అరుణ చెబుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవను పరిష్కరించేందుకు డి శ్రీనివాస్ ఇరువురితో మాట్లాడారు. అయితే ఇద్దరిలో ఎవరు కూడా డిఎస్ మాట వినే పరిస్థితి కనిపించలేదని తెలుస్తోంది. డిఎస్ మాట లెక్క చేయకుండా ఇద్దరు మంత్రులు పంతానికి పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు పంతానికి వెళుతూ చీఫ్ మాటనే వినక పోవడంతో వారి మధ్య తలదూర్చకూడదని డిఎస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీకి నష్టం కలిగించకుండా సమస్యను పరిష్కరించే పనిలో మాత్రం పిసిసి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

English summary
Ministers DK Aruna and Jupalli Krishna Rao were neglecting PCC chief D Srinivas orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X