అక్రమం సంబంధం కారణంగా తండ్రి, ప్రియురాలిని చంపిన కొడుకు!

దామరచర్లకు చెందిన వెంకటేశ్వర్ రెడ్డికి ముగ్గురు కొడుకులు. అందులో ఒకరు విలేకరిగా కూడా పని చేస్తున్నట్టుగా సమాచారం. అయితే వెంకటేశ్వర్ రెడ్డికి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ అక్రమ సంబంధంపై ముగ్గురు కొడుకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే తండ్రికి ఎంత చెప్పినా వినకలేదు. దీంతో శనివారం రాత్రి తండ్రితో పార్వతమ్మ కలిసి ఉండటాన్ని చూసిన ఓ కొడుకు వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. అయితే వారిని కొడుకులే చంపారా లేదా అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం ఎవరు నిందితులు తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications