కరీంనగర్ టిడిపి కార్యాలయానికి నిప్పు, తెలంగాణ రణభేరీపై ఆగ్రహం

TDP
కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ కరీంనగర్ కార్యలయానికి తెలంగాణవాదులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో మంటలు ఉవ్వెత్తున లేచాయి. తెలుగదేశం పార్టీ తెలంగాణ రణభేరీ కార్యక్రమాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలు టిడిపి కార్యాలయానికి నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని ఫర్నీచర్, టెలివిజన్ సెట్, పోడియం దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కార్యాలయానికి వాచ్‌మన్ తాళం వేసి వెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తెలంగాణవాదులు నిప్పు పెట్టడానికి వీలైందని అంటున్నారు. కాగా, కరీంనగర్ తెలంగాణ రణభేరీకి హైదరాబాదు నుంచి బయలుదేరిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారిని తొలుత మెదక్ జిల్లా ఇబ్రహీం నగర్ వద్ద తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత బెజ్జంకి వద్ద వారిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద యెత్తున తెలంగాణవాదుల అరెస్టు జరిగింది. పోలీసులను పెద్ద యెత్తున కరీంనగర్‌లో దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+