సోనియా, రాహుల్ గాంధీలను వెంటాడుతున్న నరేంద్ర మోడి బూచి...!

* దేశం మొత్తం మీద 28 సిటీస్ నుండి 9000మంది జనాభా ఈ సర్వేలో పాల్గోనడం జరిగింది.
* ఎలక్షన్స్ గనుక రేపు పెట్టినట్లైతే కాంగ్రెస్ పార్టీ 30శాతం ఓట్లుతోటి గెలుస్తుంది. దీనివల్ల గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 37శాతం ఓట్లు శాతంలో 7శాతం ఓట్లు నష్టపోవాల్సి వస్తుంది.
* భారతీయ జనతా పార్టీ వోట్ షేర్ 23 శాతం.
* దేశం మొత్తం మీద #1 లీడర్ ఎవరూ అంటే మన్మోహాన్ సింగ్‌కి 21శాతం రేటింగ్ ఇచ్చి నెంబర్ వన్ స్దానాన్ని కట్టబెట్టారు.
* #2 లీడర్‌గా రాహూల్ గాంధీ 19 శాతం రేటింగ్‌ని నమోదు చేశారు.
* #3 లీడర్‌గా సోనియా గాంధీ 14శాతం రేటింగ్‌ని సమోదు చేశారు.
* #4 లీడర్‌గా నరేంద్రమోడి 12శాతం రేటింగ్‌ని నమోదు చేశారు.
ఈ సర్వే ఓ చిన్న శాంపిల్‌గా మాత్రమే తీసుకోవడం జరిగింది. దీనికి కారణం పాపులారిటీ రేటింగ్స్ విషయానికి వస్తే సర్వే దేశం మొత్తం మీద ఉన్న జనాభాతో పోల్చితే కేవలం 0.00001120512016023500% మాత్రమే. 2009 లోక్‌సభ పోల్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయింది. ఎప్పుడైతే నీరారాడియా టేప్స్ ఎఫైర్స్ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నీరారాడియా ద్వారా మీడియా 2జి స్కామ్‌లో జరిగినటువంటి అవకతవకలను బయట పెట్టింది.
ఇండియాకి స్వాతంత్ర్యం రాకముందు పేపర్స్ అన్నింటి చేత బలవంతంగా నెహ్రూ గారి గురించే వార్తలు వ్రాయించేవారు. ఇండియాకి స్వాతంత్ర్యం సంపాదించిన వారిలో నెహ్రూ కూడా ఒకరు కావడం విశేషం. ఇది మాత్రమే కాకుండా మహాత్మ గాంధీకి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి సన్నిహితులలో నెహ్రూ ఒకరు. ఎప్పుడైతే సర్దార్ వల్లబాయ్ పటేల్ చనిపోయారో పార్టీలో, గవర్నమెంట్‌లో క్రమక్రమంగా నెహ్రూ యొక్క ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఆగస్టు 15, 1947 తర్వాత మీడియాకి కూడా స్వాతంత్యం వచ్చిందని నెహ్రూ క్లియర్‌గా వెల్లిడించడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ సంస్కృతి గురించి ఎమైనా తప్పుడు సమాచారం అందిస్తే గనుక ఎట్టి పరిస్ధితులలోను సహించేది లేదని స్పష్టంగా వెల్లడించారు. ఆ తర్వాత కాలంలో ఇందిరా గాంధీ మీడియా యొక్క హాక్కులను ఎమర్జెన్సీ సమయంలో కాలరాశారు. అలాంటి సమయంలో కూడా మీడియా నిజాలను ప్రజలకు తెలియజేయడానికి సాహాసించింది. ఎమర్జెన్సీ సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ తనదైన పాత్రని పోషించింది.
ఎమర్జెన్సీకి ముందు కాంగ్రెస్ పార్టీ మీడియో యొక్క హాక్కలను మొత్తం భక్షించిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు టెలివిజన్ మీడియా యొక్క సేవలు ప్రశంసనీయం. ఈ విషయంలో జర్నలిస్ట్‌లకు, టివి న్యూస్ యాంకర్స్‌కు, నిబద్దత గల కాంగ్రెస్ పార్టీ వర్కర్స్‌కు కృతజ్ఞతలు. స్టార్ న్యూస్ - నీల్సన్ సర్వే నిర్వహించినటువంటి ఈ సర్వే రేటింగ్స్ తక్కువగా తీసుకున్న ఏమంత ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఐతే మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏమికావాలో నిజనిజాలను క్షుణ్ణంగా వివరించింది.
ఏదైనా కాంపిటేషన్‌లో సాధారణంగా విజేతలకు సంబంధించి మూడు స్దానాలను మాత్రమే ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మీడియా నాల్గవ స్దానంలో వచ్చినటువంటి నరేంద్రమోడిని కూడా ప్రచురించింది. దాంతో నాల్గవ స్దానంలో వచ్చినటువంటి నరేంద్రమోడికి గాను కన్సులేషన్ ప్రైజ్‌ని ఇచ్చి సత్కరించింది. ఐతే ఇక్కడ మనం అలోచించాల్సిన విషయం ఏమిటంటే నరేంద్రమోడిని ఈ సర్వేలో ఎందుకు ప్రత్యేకంగా చూడడం అనేది. అంతేకాకుండా సర్వేలో పెట్టిన వారంతా వారసత్వ రాజకీయాలకు సంబంధించిన వారు. మన్మోహాన్ సింగ్‌కి వారసత్వ రాజకీయాలు లేకపోయినప్పటికీ ప్రధానమంత్రిగా రెండు సార్లు ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పేరుని ఉంచడం జరిగింది. అదే విధంగా నరేంద్రమోడిగారు వరుసగా రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దశ్యంతో ఆయన పేరుని కూడా సర్వేలో ఉంచారని అభిప్రాయం.
కేవలం రెండు సంవత్సరాలలో గత 60సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను అన్నింటిని మంటలో కలపడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారి పేరు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. పోయిన సంవత్సరం గనుక మనం చూసుకున్నట్లేతే రాహుల్ గాంధీ మోస్ట్ సక్సెస్ పుల్ లీడర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆయన క్యాంపెయిన్ చేసినటువంటి అన్ని రాష్ట్రాలలోను పార్టీకి మంచి ప్రజాదరణ లభించింది. దాంతో రాబోయే కాలంలో భారతదేశాన్ని పరిపాలించగలిగే సత్తా ఉన్న ప్రధాన మంత్రి అభ్యర్దిగా పేరుని సంపాదించుకున్నారు.
ఇది మాత్రమే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీకి వసంత్ సాతే చెప్పిన విన్నపం ఏమిటంటే సోనియా గాంధీ తర్వాత గాంధీ కుటుంబంలో మాస్ అప్పీల్ రాహుల్ గాంధీతో పోల్చుకుంటే కేవలం ప్రియాంగ్ గాంధీకి మాత్రమే ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఐతే ప్రియాంక గాంధీ గనుక రాజకీయాలలోకి వస్తే తన సోదరుడు అయిన రాహుల్ సైడ్ అవ్వాల్సి వస్తుందేమోనని భయంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై నోరు మెదప లేదు. అంతేకాకుండా ఈ సర్వేలో 2014లో రాబోయే ఎలక్షన్స్‌లో కూడా రీజినల్ లీడర్స్ అయినటువంటి నితీష్ కుమార్, నరేంద్రమోడి, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వ్యక్తులు వాళ్శ వాళ్శ రాష్ట్రాలలో మంచి శక్తలుగా ఎదగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పెద్ద కొరకరాని కొయ్యలుగా తయారు అవుతారని సర్వేలో వెల్లడైంది. ఇలా జరగడానికి కారణం వీరు చేసేటటువంటి మంచి పరిపాలన, ప్రజలకు ఎల్లవేళలా సమాధానమిచ్చే అడ్మినిస్ట్రేషన్.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలలోకి మరో కల్పిత కధను తీసుకోని వెళ్తుంది. ఏంటా ఆ కల్పిత కధ అని అనుకుంటున్నారా.. "సోనియా గాంధీ మాస్ లీడర్". దీని ప్రభావం రాహుల్, ప్రియాంక గాంధీల మీద కూడా పడనుందని సమాచారం. దీనిపై మీడియా స్పందన ఏమిటంటే ఈ కల్పిత కధ అందరిని భద్రపరుస్తుందని వారి నమ్మకం. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సర్వేలు కూడా వారిని భ్రమింపజేస్తాయి.
నరేంద్ర మోడిని చూసి కాంగ్రెస్ భయపడడానికి గల కారణం పాపులారిటీ, మంచితనం, ప్రజలకు సేవ చేసేటుటవంటి గుణం గల వ్యక్తిగా ముఖ్యంగా మిస్టర్ క్లీన్‌గా నరేంద్రమోడిగారికి ఉన్న ఇమేజి. కాంగ్రెస్ పార్టీలో కూడా మిస్టర్ క్లీన్‌గా మన్మోహాన్ సింగ్ ఉన్నప్పటికీ ఆయన ఎటువంటి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గోన్న అనుభవం లేదు.
అది మాత్రమే కాకుండా ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి లోక్ సభలోకి అడుగు పెట్టినటువంటి లీడర్ కాదు. బ్యాక్ డోర్ ఎంట్రీ అంటో రాజ్యసభ ద్వారా ఆయనని ప్రధాన మంత్రి చేసిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా నరేంద్రమోడి గారు మోస్ట్ పాపులర్ అవ్వడానికి మాత్రమే కాకుండా, భారతదేశానికి కాబోయేటటువంటి భావి ప్రధాన మంత్రిగా ఖచ్చితమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి కారణం అతని కష్టపడే మనసుతత్వం, ప్రజలకు సేవ చేయాలనే గుణం, గుజరాత్‌లో కులంలేని రాజకీయాలకు బీజం వేసిన మొట్టమొదటి వ్యకిగా పేరుని సంపాదించారు.
ఎంత ఎత్తుక ఎదిగినా ఒదిగి ఉండాలనేది నరేంద్రమోడి గారి లక్ష్యం. ఇది మాత్రమే కాకుండా తను ఎక్కడ నుండి వచ్చాడో అలాంటి వారికి తన వంతు సహాయం చేయాలనేది మోడి నిర్ణయం. బాల్యదశ నుంచే ఆయన అనేక ఆటంకాలను, ఇబ్బందులను ఎదుర్కున్నారు. కానీ తన బలమైన వ్యక్తిత్వం, సాహసాలతో సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని విజయం సాధించారు. ఉన్నత విద్యార్జన కోసం కళాశాల, విశ్వవిద్యాలయాల్లో చేరినప్పుడు ఆయన కఠిన పరిశ్రమ, పోరాటం చేయాల్సి వచ్చింది. జీవన సమరంలో ఆయన ఎల్లవేళలా పోరాటయోధుడు, అలుపెరగని సైనికుడే. అడుగు ముందుకు వేస్తే వెనక్కి తిరిగి చూసేది లేదు. వెనక్కి తగ్గడం గానీ ఓడిపోవడం గానీ ఎరుగరు. ఆ నిబద్ధతతోనే ఆయన రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగారు. భారతదేశ సామాజిక, సాంస్కృతికాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి, నిస్వార్థ స్ఫూర్తి, సామాజిక బాధ్యత, అంకితభావం, జాతీయతలను తనలో ఇమిడ్చుకుని సామాజిక, సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన సామాజిక జీవితాన్ని ప్రారంభించారు.
వినూత్నమైన ఆలోచనల ద్వారా యవ్వనోత్తేజ, ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ గుజరాత్ ప్రజలకు తన దృక్పథాన్ని సమర్థంగా అందించగలిగారు. తద్వారా 50 మిలియన్లకు పైగా గల గుజరాత్ ప్రజల విశ్వాసాన్ని, ఆశలను పెంచారు. లక్షలాది మంది, ముఖ్యంగా సామాన్య ప్రజలను వారి ఇంటి పేర్లతో పలకరించే జ్ఞాపకశక్తి ఆయనను ప్రజలకు ప్రేమపాత్రుడిని చేసింది. ఆధ్యాత్మిక గురువుల పట్ల గల అపారమైన గౌరవం మతాల మధ్య అంతరాలను తొలగించడానికి ఉపయోగపడింది. ఆదాయ గ్రూప్‌లకు, మతాలకు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా గుజరాత్‌లోని అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీని పారదర్శక, తమను అభివృద్ధి పరిచే దృక్పథం గల నాయకుడిగా నరేంద్ర మోడీని అభిమానిస్తున్నారు. అద్భుతమైన వక్త, మంచి మధ్యవర్తి అయిన మోడీని గ్రామీణులు, నగరవాసులు ఒకే విధంగా ప్రేమిస్తారు. ప్రతి విశ్వాసానికి, మతానికి, సమాజంలోని ప్రతి ఆదాయ వర్గానికి చెందినవారు ఆయనను అనుసరిస్తారు.
నరేంద్ర మోడీ సమర్థ పాలనలో గుజరాత్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. ప్రమాదాలన నివారణకు గాను యుఎన్ శశకావా అవార్డును, పాలనలో నూతన ఆవిష్కరణకు పాలనా, యాజమాన్యం కామన్‌వెల్త్ అసోసియేషన్ (సిఎపిఎంఎం) అవార్డును, యునెస్కో అవార్డును, ఇ - గవర్నెన్స్‌కు సిఎస్ఐ అవార్డును, తదితర అవార్డులను గుజరాత్ గెలుచుకుంది. నరేంద్ర మోడీ వరుసగా మూడేళ్ల పాటు దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలు రేటింగ్ ఇచ్చారు.
నరేంద్రమోడికి నాల్గవ స్దానం రావడం పట్ల కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని సమాచారం. ఇటీవల కాలంలో మోడి భయం గురించి ఫ్రాంకోయిస్ గౌటిర్ చాలా చక్కగా రాయడం జరిగింది. దాని సమాచారం మీకోసం నరేంద్రమోడిపై సోనియా ఎందుకు అర్దం లేకుండా మాట్లాడుతుందో తెలియడం లేదు. బహుశ రాబోయటటువంటి జనరల్ ఎలక్షన్స్‌లో తన కుమారుడు రాహుల్ గాంధీకి ఎదురుగా ప్రధానమంత్రి అభ్యర్దిగా నిలబడపోయేది నరేంద్రమోడియేనని అమె భావన కాబోలు అందుకే ఇలా చేస్తుంది. సోనియా నేర్పరితనం చాలా మెచ్చుకోదగ్గది.
అసలు రాబోయే టటువంటి ఎలక్షన్స్‌లలో కాంగ్రెస్ ప్రసార అస్త్రాలు లౌకికవాదం, మతాతీత భావనే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీటితోపాటు ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అచీవ్‌మెంట్స్. ఈరోజల్లో రాజకీయ నాయకులు తమ పదవికోసం ఎలాంటి ఛీప్ ట్రిక్స్ అయినా ప్లేచేయడానికి వెనుకాడడం లేదు. ఇలాంటి సర్వేలు ఎన్ని చేసినా చివరకు రియాలిటీ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అదంతా ప్రజల మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది.












Click it and Unblock the Notifications