తెలంగాణపై నేను అలా అనలేదు: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి

Purandeswari
కరీంనగర్: తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనేది కాంగ్రెసు నిర్ణయమని తాను అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణను తాను రెండో ఎస్సార్సీకి ముడిపెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణతో రెండో ఎస్సార్సీకి సంబంధం లేదని ఆమె అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆమె చెప్పారు.

అంతకు ముందు కరీంనగర్ జిల్లాలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి తెలంగాణ సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామం వద్ద తెలంగాణవాదులు గురువారం పురంధేశ్వరిని అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్‌కి వారు అడ్డంగా వచ్చి ఆమెను ఆపేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. పురంధేశ్వరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పురంధేశ్వరి కాన్వాయ్‌ని తప్పించి పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రీయ విద్యాలయం కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా పురంధేశ్వరికి ఈ సంఘటన ఎదురైంది. తెరాస మహిళా విభాగం కార్యకర్తలు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు జరిపిన లాఠీచార్జీలో ఓ మహిళా కార్యకర్త కాలు ఫ్రాక్చర్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+