ముఖ్యమంత్రిపై నో కామెంట్, జగన్ - చంద్రబాబుల మధ్యే సవాళ్లు: రోశయ్య

తనకు గవర్నర్ పదవి వస్తుందన్న వార్తలు కేవలం మీడియాలో వస్తున్న కథనాలు అని ఆయన కొట్టి పారేశారు. తనకు ఏ పదవో ఇవ్వడానికి అధిష్టానం పిలవలేదు, తనకు పదవి ఇవ్వమని కోరడానికి తాను గానీ ఢిల్లీ రాలేదన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించినందుకు కృతజ్ఞలు చెప్పుకునేందుకే వచ్చానన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రిలీఫ్‌గా ఉంటారని కలవడానికి వచ్చానన్నారు. పార్టీ అధిష్టానానికి రాసిన లేఖలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సోనియాతో చర్చిస్తానని చెప్పారు. కాగా ఆయన మధ్యాహ్నం సోనియాగాంధీతో సమావేశం అయ్యారు.












Click it and Unblock the Notifications