హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ వారసత్వానికి కాంగ్రెసు సమాధి, కిరణ్‌కు సోనియా సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వానికి కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో సమాధి కట్టాలని భావిస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని వైయస్సార్ ఫొటోలను తొలగించారు. ప్రభుత్వ పథకాల్లో ఆయన పేరు కనిపించకుండా చేశారు. సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి, మహిళా సాధికారిత, రైతు సమస్యలపై సమాచార, పౌర సంబంధాల శాఖతో మూడు ప్రధాన వాణిజ్య ప్రకటనలను రూపకల్పన చేయించారు. వీటిని దృశ్య మాధ్యమంలో ప్రసారం కోసం నిర్దేశించారు. వాటిలో ఎక్కడా వైయస్సార్ ఫొటో కనిపించకుండా చేశారు. వాటిలో కిరణ్ కుమార్ రెడ్డి, కొన్ని చోట్ల పిసిసి చీఫ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి.

సచివాలయంలో ఉన్న వైయస్సార్ ఫొటోగ్రాఫ్‌లను తీసేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొందరు మంత్రులు ఇప్పటికే తీసేశారు. కడప ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో వైయస్సార్ యుగానికి కాంగ్రెసులో స్వస్తి పలకాలని సోనియా గాంధీ అనుకోవడమే తరువాయి మార్పులు ప్రారంభమయ్యాయి. ఎంతగా ప్రయత్నించినప్పటికీ వైయస్సార్ వారసత్వం కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడదని, వైయస్ జగన్‌కే అది ఉపయోగపడుతుందని కాంగ్రెసు అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్ వారసత్వాన్ని వదిలేసి పార్టీని పటిష్టం చేయడమే మార్గమని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
The YSR era seems to have come to an end in Andhra Pradesh. Reportedly instructed by Congress president Sonia Gandhi, the Kiran Kumar Reddy government has done away with the former CM's photographs and name in all the government campaigns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X