SRH vs PBKS: గట్లుంటది మరి మనతోని.. హైదరాబాద్ నంబర్ 1 భయ్యా!!
SRH vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగిన 49వ ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఓటముల హ్యాట్రిక్‌ను మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు సాధించగా.. పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకే పరిమితమైంది.
హైదరాబాద్ బ్యాటర్ల పరుగుల విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (38) ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. హెడ్ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ తన బ్యాట్‌కు పనిచెబుతూ విధ్వంసకర హాఫ్ సెంచరీ (55) సాధించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కూడా చెలరేగి 43 బంతుల్లో 69 పరుగులు చేయడంతో హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.

కూపర్ కాన్లీ వీరోచిత పోరాటం వృథా
236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే తడబడింది. ప్రియాన్ష్ ఆర్య(1), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(3) తక్కువ పరుగులకే వెనుదిరగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా నిరాశపరిచాడు. మార్కస్ స్టోయినిస్(28), సూర్యాన్ష్ షెడ్గే(25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు కూపర్ కాన్లీ అద్భుత పోరాటం చేశాడు. కేవలం 59 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ.. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్
ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచుల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ 10 మ్యాచుల్లో 13 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. సొంత గడ్డపై హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయిన కూపర్ కాన్లీ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications