ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ఇప్పట్లో చర్చకు రానట్లే

Assembly
హైదరాబాద్: రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఇప్పట్లో శాసనసభలో చర్చకు వచ్చే అవకాశాలు లేవని అర్థమవుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు గానీ చర్చ తర్వాత వోటింగ్‌కు గానీ కాంగ్రెసు వర్గాలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీకి దించడంతో బలనిరూపణ జరిగిపోయిందంటూ కాంగ్రెసు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే మాట అన్నారు. దీన్ని బట్టి శాసనసభలో ఇప్పట్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు రాదని తెలుస్తోంది.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమే శనివారం నాటి శాసనసభ ఎజెండాలో ఉందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిశీలించాల్సి ఉంటుంది. దాన్ని ఆయన ఇప్పట్లో పరిశీలిస్తారని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. బహుశా, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలంటే వర్షాకాలం సమావేశాల దాకా ఆగాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని గవర్నర్ భావించినప్పుడు బలనిరూపణకు గవర్నర్ ఆమోదించవచ్చు. అటువంటి పరిస్థితి కూడా లేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ప్రబుత్వానికి తగిన మెజారిటీ ఉన్నట్లు తేలిపోయిందనే వాదనకు బాలం చేకూరుతోంది. ఒకవేళ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇస్తే గవర్నర్ బలపరీక్షకు ఆదేశించే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ అందుకు సిద్ధంగా లేరు. ఇదే విషయంపై చంద్రబాబు జగన్‌ను చిక్కుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+