రాజ్‌ఘాట్ వద్ద అన్నా హాజరే దీక్ష ప్రారంభం, వేలాది మంది చేరిక
National
oi-Pratapreddy
By Pratap
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్, ఆయన అనుచరులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద బుధవారం ఒక రోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. దీక్షా శిబిరానికి వేలాది మంది కదిలి వచ్చారు. గాంధీ టోపీలు ధరించిన వేలాది మంది యువకులు, పెద్దలు త్రివర్ణ పతాకను చేతుల్లో ధరించి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. మహాత్మా గాంధీ వేషధారి రఘుపతి రాఘవ్ రాజా రామ్ గీతాన్ని ఆలపిస్తూ ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంది.
హాజారే దీక్షలో సర్వమత ప్రార్థనలు ఉంటాయి. లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అన్నా హాజరే దీక్షకు రాజ్‌ఘాట్‌ను వేదికగా ఎంచుకున్నారు.
Thousands of people have gathered at Rajghat here to take part in the day-long hunger strike called by Anna Hazare to protest against police crackdown on Baba Ramdev and his supporters during their agitation against corruption.