2004లో బొత్స భయపడ్డాడు, సిఎం రాజీనామా చేయాలి: సిసిరెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: 2004 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భయపడిన రోజులు తనకు తెలుసునని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సిసి రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. భయంతోనే బొత్స సత్యనారాయణ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బొత్స ఎంపిక వల్ల వైయస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గుంటే కడప, పులివెందుల ఫలితాలు చూసినప్పుడే రాజీనామా చేయాలని అన్నారు. బొత్స నియామకం కారణంగా ముఖ్యమంత్రిలో కూడా వణుకు ప్రారంభం అయిందన్నారు.
కాగా ముఖ్యమంత్రి గానీ, ప్రభుత్వం గానీ జగన్ ఎమ్మెల్యేల నిధులను అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వానికే నష్టం అన్నారు. వారి వైఖరి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.