అబ్బాయ్‌పై దుమ్మెత్తి పోసిన వైయస్ వివేకానంద రెడ్డి

YS Vivekananda Reddy
కడప‌: అబ్బాయ్ వైయస్ జగన్ పార్టీపై మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన గురువారం కడప జిల్లా పులివెందులలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పులివెందులలో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, వారు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం గుండాలకు, రౌడీలకు నిలయంగా మారిందని దుమ్మెత్తిపోశారు.

కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన ఇప్పట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించాడని, దీనిపై గతంలో కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేస్తూ ప్రస్తుతం అదే భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు బాధితుడికి న్యాయం చేయడానికి ప్రయత్నించారని, ఈ సందర్భంలో పోలీసులను సమర్థించడానికి బదులు బెదిరించేందుకు పూనుకున్నారని ఆయన అన్నారు. ధర్నాలు చేయడం, భారీగా జనాలను తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+