మంత్రులు సహా 47 మంది రాజీనామాలకు రెడీ

జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్దన్ రెడ్డి ఇచ్చిన రాజీనామా పత్రం సరిగా లేనందున ఆయన రాజీనామా ఆమోదించలేదని తెలుస్తోంది. అయితే ఆయన మరో రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. కాగా మంత్రులు ఎవరూ గవర్నర్ అపాయింటుమెంట్ కోరలేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ క్యాంప్ కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ సైతం రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అమెరికా నుండి ఫాక్సులో తన రాజీనామా లేఖను పంపారు.












Click it and Unblock the Notifications