పద్మనాభ స్వామి ఆలయ సంపద రూ. 1 లక్ష కోట్లు

సంపద అంతా ఆలయానికే ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. దాన్ని అక్కడే నిల్వ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బయటకు వచ్చిన సంపదకు మతపరమైన, చారిత్రక ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు. ఆరు నేల మాళిగల్లో ఆభరణాల ఖజానాలు బయపడ్డాయి. బయటపడిన సంపదలో 18 అడుగుల నెక్లెస్ కూడా ఉంది. 536 కిలోల బరువు గల బంగారం నాణేలు బయటపడ్డాయి. పజ్రాలు పొదిగిన ప్లేటు, వెండి, బంగార పాత్రలు, అద్భుత దీప సౌందర్యం, పోతపోసిన బంగారం వస్తువులు ఉన్నాయి. అత్యద్భుతమైన ప్రాచీన, సంప్రదాయ వస్తువులు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications