హైదరాబాదులో సీమాంధ్ర టిడిపికి తెలంగాణ సెగ

కాగా ఈ నెల 7వ తేదిన తెలంగాణ ప్రాంత విద్యార్థులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బందు ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అంతా ప్రశాంతంగా ఉందన్నారు. పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశామని చెప్పారు. భద్రత కోసం 31 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. బందులో ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూల్సు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోక తప్పదన్నారు. పాఠశాలలు, దుకాణాలు తెరిస్తే భద్రత కల్పిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications