శింగనమల ఫ్లాట్‌లో భాను కిరణ్, సూరి రాసలీలలు?

పొద్దుటూరు ఫైనాన్స్‌లో తాను 25 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. కడప, అనంతపురాల్లో తాను 50 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టానని ఆయన చెప్పారు. తాను లేనప్పుడు అమ్మాయిలతో గడపడానికి భాను, సూరి వచ్చేవారని ఆయన తెలిపారు. ఫ్లాట్‌ను తన పేరు మీద రాసివ్వాలని సూరి తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు. సూరిని హత్య చేసిన తర్వాత భాను తనతో కాంటాక్టులో ఉన్నాడని, ఆ తర్వాత కాంటాక్ట్ తెగిపోయిందని ఆయన చెప్పారు. తనపై ఆర్థిక లావాదేవీలకు సంబంధఇంచి 60 కేసుల దాకా ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కారు బాంబు కేసులో నిందితుడు భాను పేరు చెప్పి వైజయంతి రెడ్డిని, షాలిమార్ యజమానిని బెదిరించామని ఆయన చెప్పారు.
పోలీసులు బెంగుళూర్, చెన్నై, హైదరాబాదుల్లోని ఆస్తులపై దాడులు నిర్వహించారు. చెన్నైలోని రెండు లాకర్లను సీజ్ చేశారు. శింగనమల రమేష్ సిఐడి కస్టడీ శుక్రవారం ముగిసింది. దాంతో సిఐడి పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications