ఆల్ ప్రీ చంద్రబాబు బాటలో జగన్: లగడపాటి ఫైర్

lagadapati rajagopal
విజయవాడ: నాడు మహాకూటమి, మెగా కూటమిలు అనేక వాగ్దానాలు చేశాయన్నారు. నేతల వాగ్దానాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డివి ఆచరణ సాధ్యం కాని హామీలు అన్నారు. జగన్ మొత్తం దాదాపు అరవై వేల కోట్ల వాగ్దానాలు చేశారన్నారు. కుప్పలకొద్ది వాగ్దానాలు ఆచరణ శూన్యమన్నారు. హామీల్లో జగన్ ఆల్ ప్రీ చంద్రబాబు బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ విషయంలో ఏదో చేస్తాడని ఊదరగొట్టిన జగన్ తీరా ప్లీనరీలో తనకు తెలంగాణ ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. తనకు శక్తి లేదని జగన్ ఒప్పుకున్నారని అన్నారు. జగన్ను గానీ, జగన్ హామీలను గానీ ప్రజలు నమ్మరన్నారు. జగన్ తన తండ్రి వైయస్ బాటలో నడుస్తారని అందరూ భావిస్తే ఆయన చంద్రబాబు బాటలో నడిచారని విమర్శించారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్లు అంటే జగన్ రెండు చెవుల సిద్దాంతాన్ని అందుకున్నారన్నారు.

తెలంగాణపై నిస్సహాయుడై చేతులెత్తేసిన జగన్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్ కన్ను ముఖ్యమంత్రి పీఠం పైనే ఉందన్నారు. రాష్ట్రంలో భూములే లేకుంటే ఎకరా చొప్పున భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. జగన్ పార్లమెంటులో ఒక్కసారైనా ప్రజా సమస్యల పైన మాట్లాడారా అని ప్రశ్నించారు. సొంత మీడియా ఉందని జగన్ ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయవలసిన అవసరం లేదన్నారు. నాడు తాము రాజీనామాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడానికి తాము ఆనాడు రాజీనామాలు చేయలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కేవలం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే పాస్ కాదని తెలియజెప్పడానికే తాము రాజీనామాలు చేశామని చెప్పారు. చర్చల ద్వారానే తెలంగాణకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+