ఆజాద్ తెలంగాణ నేతలను మరింత రెచ్చగొట్టారా?

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి ఆజాద్‌ను తప్పించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా వ్యవహరించే కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఆజాద్‌పై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి తెలియని ఆజాద్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 48 గంటల దీక్ష చేపట్టిన కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆజాద్‌ను లక్ష్యం చేసుకుని మాట్లాడారు.
తాము రాజీనామాలు చేసిన తర్వాత తమతో మాట్లాడకుండా ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన ఆజాద్ అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పడం ద్వారా తమను అవమానించారని పార్టీ తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తమ పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.












Click it and Unblock the Notifications