తెలంగాణ పరిష్కారానికి సీమాంధ్ర నేతలూ తొందర

Telangana
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారం సాధ్యమైనంత తొందరగా జరగాలని సీమాంధ్ర నాయకులు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివ రావు వంటి నాయకులే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి వంటివారు కూడా కోరుతున్నారు. నిజానికి, తెలంగాణ సమస్య వల్ల ప్రభుత్వం పనిచేయలేని స్థితి ఉంది. సీమాంధ్రకు చెందిన నాయకులెవరూ తెలంగాణలో పర్యటించలేని వాతావరణం ఉంది.

సీమాంధ్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటించడం లేదు. అందుకు ఇటీవల మంత్రి రఘువీరా రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే, ఆయనకు కూడా తెలంగాణ సెగ తగిలింది. రాజీనామాలు చేయక ముందు తెలంగాణకు చెందిన మంత్రులు పర్యటించలేదని వాతావరణం నెలకొని ఉంది. తెలుగుదేశం నాయకులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయోగాలు చేశారు. అయితే, కట్టుదిట్టమైన భద్రతతో, అరెస్టుల ద్వారా తెలంగాణలో పర్యటించడం ఎంతో కాలం సాగదని ఆయన గ్రహించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ మంత్రులు, శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు లొంగివస్తారని, రాజీనామాలు ఉపసంహరించుకుంటారని పార్టీ అధిష్టానం భావించింది. వాస్తవాలు తెలియకపోవడం వల్లనే అలా భావించి ఉంటారని అనుకుంటున్నారు. వారు రాజీనామాలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలపై పట్టువిడుపులు ప్రదర్శించకపోవడం ఆశ్చర్యకరమే. బహుశా, ప్రజల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి, ప్రజల ఒత్తిడికి భిన్నంగా వ్యవహరిస్తే రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసుకుపోతాయనే భయంతోనే వారు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+