శింగనమలపై మరో కేసు, నేడు కర్నూలు కోర్టుకు!

Singanamala Ramesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ గురువారం కర్నూలు జిల్లా కోర్టుకు హాజరు కానున్నారు. ఓ వ్యక్తికి 30 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉండగా ఆయన చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 30 లక్షల చెక్ బౌన్స్ కేసు విషయంలో శింగనమల కర్నూలు కోర్టుకు వెళ్లనున్నారు. శింగనమల రమేష్ బ్లాక్ మెయిల్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని భానుకిరణ్‌తో కలిసి బెదిరించిన కేసులో ఇప్పటికే కటకటాల వెనక్కి వెళ్లాడు. వైజయంతిరెడ్డి సైతం భానుకిరణ్‌తో కలిసి తనను బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా షాలిమార్ వీడియోస్ సంస్థ అధినేతను సైతం పులి, ఖలేజా చిత్రాల విషయాలలో మోసం చేశారనే కేసు నమోదైంది. వైజయంతీరెడ్డి, షాలిమార్ అధినేతను బెదిరించిన విషయంలో శింగనమలను అరెస్టు చేసినప్పటికీ భానుకిరణ్‌తో గల సంబంధాలను కూపీలాగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+