టెక్కీల పేరుతో మకాం వేసి హైటెక్ వ్యభిచారం

Vizag-map
విశాఖపట్నం: పోలీసులు విశాఖపట్నంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. విశాఖపట్నంలోని ఓ ఆపార్టుమెంటులో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వ్యభిచారం వ్యవహారాలను సిసిటివీ కెమెరాల్లో బంధించారు. ఆ దృశ్యాలు ఆదివారం సాయంత్రం ఓ తెలుగు టీవి చానెల్‌లో ప్రసారమయ్యాయి. వారం రోజుల పాటు మాటు వేసి ఈ వ్యభిచారం రహస్యాన్ని పోలీసులు రట్టు చేశారు.

నిర్వాహకులు తాము సాఫ్ట్‌వేర్ నిపుణులమని చెప్పి ఓ ఆపార్టుమెంటులో దిగారు. వైజాగ్ ఎస్కార్ట్ పేరు మీద వారు ఓ వెబ్‌సైట్‌ను నడిపిస్తూ కస్టమర్లు ఆన్‌లైన్‌లో అమ్మాయిలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఎక్కడి అమ్మాయి కావాలంటే అక్కడి అమ్మాయిలను సరఫరా చేస్తూ ఆ ఆపార్టుమెంటు ఫ్లాట్‌లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కస్టమర్లను ఫ్లాట్‌లో ఉంచి, దాంట్లోకి అమ్మాయిలను పంపి వ్యవహారం నడిపించేవారు.

వాచ్‌మన్‌కు కూడా అనుమానం రాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. ఈ హైటెక్ వ్యభిచారం విశాఖపట్నంలోనే కాకుండా ఢిల్లీ, హైదరాబాదుల్లో కూడా నడుపుతున్నట్లు సమాచారం. ఈ వివరాలను సేకరించే పనిలో విశాఖపట్నం పోలీసులు పడ్డారు. గత 20 రోజుల్లో 200 మంది అమ్మాయిలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడైంది. అరెస్టయినవారిలో ఇద్దరు మగవాళ్లు, ఓ స్త్రీ ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+