వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మళ్లీ నోరు విప్పిన చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మరోసారి నోరు విప్పారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సమస్య పరిష్కారం సాధ్యమని గతంలో పాడిన పాటనే మరోసారి పాడారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చలు జరుపుతున్నారని, ఇదే విధమైన అంతర్గత చర్చలు తెలుగుదేశం పార్టీలో కూడా జరగాలని ఆయన అన్నారు. పార్టీలు అంతర్గత చర్చలు ద్వారా పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలపై, ప్రజలపై బలవంతంగా రుద్దలేమంటూ ఆయన చేతులెత్తేశారు. సమస్య పరిష్కారం ఎవరికి వారు అసాధ్యమంటే లాభం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నిలువునా చీలిపోయాయని ఆయన అన్నారు. బిజెపి మాత్రమే తెలంగాణపై ఒకే మాటపై ఉందని ఆయన చెప్పారు. బిజెపి మినహా అన్ని పార్టీలు చీలిపోయాయని ఆయన అన్నారు.

English summary
Union Home minister P Chidambaram repeated his words and sang same song on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X