వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్ కన్నా కర్ణాటక మైనింగ్ స్కామ్ పెద్దది

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా కర్ణాటక మైనింగ్ స్కామ్ పెద్దదని కాంగ్రెసు పార్టీ అంటోంది. లోకాయుక్త సంతోష్ హెగ్డే ముఖ్యమంత్రి యడ్యూరప్పను, ఆయన కుటుంబ సభ్యులను తప్పు పట్టిన నేపథ్యంలో కర్ణాటక మైనింగ్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. టెలికం రంగాన్ని దెబ్బ తీసిన 2జి స్కామ్ కన్నా 16,085 కోట్ల మైనింగ్ స్కామ్ అతి పెద్దదని కాంగ్రెసు అధికార ప్రతినిధి బికె హరిప్రసాద్ గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యడ్యూరప్పను రాజీనామా చేయాలని బిజెపి చేసిన డిమాండ్ ఆలస్యమైందని, ఆ చర్య సరిపోదని ఆయన అన్నారు.

ఆరు నెలల క్రితమే యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సిందని మరో కాంగ్రెసు అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. యడ్యూరప్పపై, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని షకీల్ అహ్మద్ అన్నారు. యడ్యూరప్ప ఇంకా రాజీనామా చేయలేదని, ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని ఆయన అన్నారు. లోకాయుక్త తప్పు పట్టిన మిగతా మంత్రులు కూడా రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు.

English summary
The Congress party on Thursday demanded a Central Bureau of Investigation (CBI) probe into the illegal mining scam in Karnataka, a day after the state Lokayukta, Justice (retired) N Santosh Hegde, named Chief Minister BS Yeddyurappa and members of his family as having committed acts of corruption in his report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X