హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రను తమిళనాడులో కలపాలి: టిఆర్ఎస్ నేత వినోద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod kumar
హైదరాబాద్: దేశ సమగ్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వద్దని చెబుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అదే సమగ్రత కోసం తమిళనాడులో కలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ సూచించారు. తమిళనాడు నుండి వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు డిమాండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వారు డిమాండ్ చేసిన తరహాలోనే మేమూ డిమాండ్ చేస్తున్నామని అందులో తప్పేముందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పడినాయని చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు.

పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దేశంలో గోవా వంటి కృష్ణా జిల్లా కంటే చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నేతల మాదిరి కృష్ణా జిల్లా నేతలమంతా రాజీనామాలు చేస్తే ప్రత్యేక కృష్ణా రాష్ట్రాన్ని ప్రకటిస్తారా అని కావూరి హేళన చేయడం సరికాదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.

English summary
Telangana Rastra Samithi former MP Vinod Kumar suggested to merge Andhra in Tamilnadu state for national integrity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X