హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను దేవుడు చూస్తున్నాడు!: మంత్రి సారయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baswaraj Saraiah
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుకు పాల్పపాడిన అవసరం లేదని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య గురువారం అన్నారు. కాంగ్రెసు పార్టీ సర్వనాశనం అవుతుందన్న జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్ చెబుతున్నట్టుగా దేవుడు అన్నీ చూస్తున్నారని అన్నారు. రాజ్యాంగ భారతదేశంలో అందరూ చట్టాలను నమ్మాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో హైకోర్టు తీర్పు చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు. కాగా తెలంగాణపై సైతం సారయ్య స్పందించారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాష్ట్రం ఎన్ని ముక్కలు అయిన అభ్యంతరం లేదని అన్నారు. రాష్ట్రం ఇవ్వకపోతే యువకులు పక్కదారి పట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ మతకల్లోహాలు లేవని అన్నారు.

ఆగస్టు 15 జెండా వేడుకల్లో మంత్రులు పాల్గొనాలా లేదా అనే విషయం స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు. తామంతా గాంధేయ వాదులం. కాబట్టి అహింసాయుతంగా పోరాడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏదేదో ఊహించుకొని చర్చలకు రాకపోవడం సరికాదని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కొన్ని శాఖలను ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. భద్రతా దళాలు పెంచింది సైతం ప్రజల గురించే అని చెప్పారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు తాను చూడలేదని అవి చూశాక స్పందిస్తానని మరో మంత్రి అహ్మదుల్లా కడపలో అన్నారు.

English summary
Minister Baswaraj Saraiah opposed YSR Congress party president YS Jaganmohan Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X