అవును బాధ్యులమే.. కానీ: శంకర్‌రావు వ్యాఖ్యలపై బొత్స

అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... శంకర్ రావు ఏ ఉద్దేశ్యంతో సిబిఐకి లేఖ రాశారో తనకు తెలియదన్నారు. అది తెలుసుకున్న తర్వాత ఏమైనా మాట్లాడవచ్చునని చెప్పారు. నాటి మంత్రివర్గంలో ఉన్నా వారిగా సిబిఐ విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శంకర్ రావు వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నట్లు మరో మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. మంచి జరిగినా చెడు జరిగినా నిర్ణయాలకు మంత్రివర్గం బాధ్యత వహించాల్సిందే అని చెప్పారు. నిర్ణయాలకు వైయస్ ఎంత బాధ్యుడో నాటి మంత్రులు సైతం అంతే బాధ్యులన్నారు.












Click it and Unblock the Notifications