సాధారణ ఖైదిగానే గాలి: టిఫిన్ చేయడానికి అయిష్టత

అనంతరం తన లాయర్లతో కేసు విషయమై సుమారు గంట సేపు సమాలోచనలు జరిపారు. వైద్యులు వచ్చి గాలికి వైద్య పరీక్షలు చేశారు. గాలి తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని జైలు అధికారులను కోరలేదు. కోర్టు సైతం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించలేదు. కాబట్టి ఆయనను సాధారణ ఖైదీలాగే చూస్తున్నట్టు కేశవనాయుడు చెప్పారు. మధ్యాహ్నం గం.11.30ని. ప్రాంతంలో లంచ్ ఇవ్వనున్నారు. అయితే గాలి లంచ్‌కు నిరాకరించిన ఆయన కోరిన ఆహారం ఇవ్వాలంటే వైద్యుల నివేదిక, సలహా ఆధారంగానే ఇస్తామని చెప్పారు.
కాగా సోమవారం గాలి జనార్దన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాటకీయ ఫక్కీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో కర్నాటక వెళ్లిన సిబిఐ సోమవారం ఉదయమే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి గాలిని, ఓఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications