గాలి జనార్దన్ రెడ్డి, జగన్ లింక్‌లపై సిబిఐ ఆరా

కడప జిల్లాలో తలపెట్టిన గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారాలను కూడా సిబిఐ పరిశీలిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ కర్మాగార స్థాపనకు గాలి జనార్దన్ రెడ్డికి 10,675 ఎకరాల భూమిని కేటాయించారు. ఇటు జగన్ రెడ్డితోనూ, అటు గాలి జనార్దన్ రెడ్డితోనూ సంబంధాలు పెట్టుకున్న ఆర్ఆర్ గ్లోబల్ వ్యవహారాలను కూడా పరిశీలిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి ఆర్ఆర్ గ్లోబల్ సబ్ కాంట్రాక్టు పొందింది. ఆర్ఆర్ గ్లోబల్ నుంచి జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికలోకి పెద్ద యెత్తున నిధులు చేరాయి. ఈ సంబంధమే బ్రాహ్మణి స్టీల్స్‌పై సిబిఐ దృష్టి సారించడానికి కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications