ఢిల్లీలో ప్రతిపక్షాల నేతల నుంచి జగన్‌కు నిరాశే

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా జగన్‌ను పలకరించడానికి పెద్దగా ఇష్టపడ లేదు. వైయస్ జగన్ వద్ద మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెసు ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి మర్యాద కోసమే కూర్చున్నట్లు చెబుతున్నారు. ఎట్టకేలకు జగన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ మాత్రం సమయం ఇచ్చారు. పది నిమిషాల సేపు జగన్ ములాయంతో సమావేశమయ్యారు. సమావేశానంతరం జగన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మొత్తం మీద జగన్‌కు ఢిల్లీలో అంతగా ఆదరణ లభించడం లేదని చెప్పవచ్చు.
సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ గానీ సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ గానీ జగన్‌తో భేటీకి అంగీకరించే అవకాశం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్న వారు జగన్‌తో భేటీకి ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications