హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగతితోపాటే సండూరుపై విచారణ: సుప్రీం నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి పదో రోజు కూడా సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. గత తొమ్మిది రోజులు వరుసగా విజయ సాయి రెడ్డిని విచారించిన సిబిఐ అధికారులు మంగళవారమూ విచారిస్తున్నారు. ఆయన ఉదయాన్నే విచారణకు హాజరయ్యారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ కేసుల్లో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఎమ్మార్ విల్లా ప్రతినిధులను సిబిఐ ప్రశ్నిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాలక్ష్మి, మీనాక్షి ఇన్ ఫ్రా, రేవతి ఫైనాన్స్, కాకినాడ సీపోర్టు, రేవతి ఫైనాన్స్, నలుగురు యుబిఐ ప్రతినిధులు మంగళవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు.

కాగా జగన్ కంపెనీలలో పెట్టుబడులపై సండూరు పవర్ ప్రాజెక్టు వేసిన పిటిషన్ పైన జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసులతో పాటే విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించుకుంది. కాగా తన ఆస్తుల పైన సిబిఐ దర్యాఫ్తును ఆపి వేయించడానికి జగన్ ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లి భంగపడ్డారు. మూడోసారి వెళ్లే అవకాశం లేక పోవటంతో తనకు చెందిన కంపెనీలు, తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ద్వారా సుప్రీం కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Jagathi Publications vice chairman Vijay Sai Reddy attended before CBI on ninth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X