తెలంగాణకు వ్యతిరేకం కాదు: బొత్స సత్యనారాయణ

తెలంగాణ సమస్య జఠిలమైందని, సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం అంతర్గత చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. సమ్మెను విరమించుకోవాలని ఆయన తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం చరచ్లు జరుపుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ సీటుకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని ఆయన అన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా పార్టీ విధానం మేరకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తాను ఆజాద్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications