రాయపాటి సాంబశివరావు వర్సెస్ నాగం జనార్దన్ రెడ్డి

రాయపాటి సాంబశివరావుపై నాగం జనార్దన్ రెడ్డి భగ్గుమన్నారు. దమ్ముంటే రాయపాటి సాంబశివ రావు తెలంగాణలో బస్సుయాత్ర చేపట్టాలని సవాల్ చేశారు. ఒకప్పుడు దివాళా తీసిన రాయపాటి సాంబశివరావు తెలంగాణ భూములను ఆక్రమించుకుని గట్టెక్కారని ఆయన హైదరాబాదులో ఆరోపించారు. రాయపాటి ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముమ్మాటికి సమైక్యవాదేనని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబుకు చెంచాలుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications