వైయస్ జగన్ అంబటి రాంబాబుని పక్కకు పెడతారా?

Ambati Rambabu and YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును పక్కకు పెడతారా? ఇటీవల ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన అంబటి రాసలీలల వ్యవహారం, భూదందా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంబటి రాసలీలల ప్రసారాలు రావడంతో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా పలువురు అంబటి రాంబాబు అలాంటి దుర్మార్గానికి పాల్పడితే పార్టీ నుండి బహిష్కరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే కాంగ్రెసును వీడాక జగన్ చాలా చిక్కుల్లో పడ్డారనే చెప్పవచ్చు. బిజెపికి దగ్గరయ్యే అవకాశం ఆయనే స్వయంగా దూరం చేసుకోవడం, ఆ తర్వాత జగన్ సన్నిహితుడని అందరూ భావించే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు చకచకా జరిగిపోయాయి. ఆయన ఆస్తులపైనా సిబిఐ వేగంగా విచారణ జరుపుతోంది. అది చాలదన్నట్లు జగన్ గొంతుకైన అంబటిపై రాసలీలలు, భూకుంభకోణం వ్యవహారం ఉందని ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. ఇలాంటి సమయంలో అంబటిని జగన్ వెనుకేసుకు రాకుండా ఆయనను పక్కకు పెడతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ జగన్ అంబటిని పలుమార్లు పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించక ముందు నుండి జగన్‌కు అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న అంబటి పార్టీ స్థాపించిన తర్వాత అధికారికంగా అధికార ప్రతినిధి అయ్యారు. జగన్ పైన, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పైన ఈగ వాలనీయనన్నట్లుగా మాట్లాడే అంబటి తీరు నచ్చకే జగన్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీలో ఆయనకు చోటి ఇవ్వలేదనే వాదనలు ఉన్నాయి. అంబటి తీరుపై పార్టీ వాళ్లు కొందరు ఫిర్యాదు చేయడం వల్లనే జగన్ ఆయనకు పార్టీలో అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదట.

అప్పట్లో జగన్‌పై అంబటి అలిగాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలు రాగానే అంబటి రాంబాబు తెరపై చురుగ్గా కనిపించారు. అయితే అంబటి అలిగినప్పటికీ జగన్‌తో పాటు పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోక పోయినప్పటికీ తనంత తానుగానే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకున్నాడట. అంతేకాదు జగన్ పైన విమర్శలు వచ్చినా, ఎవరైనా ఏమైనా అన్నా వారిపై విమర్శలు గుప్పించడానికి అందరికంటే ముందుండే వాడు అంబటియే. అలాంటి వ్యక్తి పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంటాడనుకుంటే తప్పే అవుతుందట. ఎందుకంటే జగన్ కీలక సమావేశాలలో పిల్లి సుభాష్ చంద్రబోసు, శోభా నాగిరెడ్డి తదితరులు ఉన్నప్పటికీ అంబటికి మాత్రం చోటు లేదట. మరి రాసలీలలు, భూదందాకు ముందే అంబటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వని జగన్ ఇప్పుడు ఆయనను మరింత పక్కకు పెట్టే అవకాశాలూ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+