బాబు అంచనా: గాలి అరెస్టు తర్వాత తగ్గిన జగన్ బలం

గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలపై తాము ఆరోపణలు చేస్తున్నప్పుడు చాలా మంది రాజకీయంగా భావించారని, అరెస్టు జరిగిన తర్వాత తమ ఆరోపణల్లోని వాస్తవాలు ప్రజలకు తెలిసి వచ్చాయని ఆయన అంటున్నారు. వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన నాయకులు ఆందోళనలో పడ్డారని చెబుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా జగన్ ప్రాబల్యం తగ్గిందని చంద్రబాబు చెబుతున్నారని సమాచారం.
జగన్ అరెస్టయితే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చాలా మంది భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది ఆ భయంతోనే ఉన్నట్లు, దాంతోనే ఇటు కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతోందని చెప్పవచ్చునని చంద్రబాబు చెబుతున్నారు. పైగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తన పర్యటనకు లభించిన ఆదరణ ఆశావహంగా ఉందని ఆయన చెబుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications