వైయస్ జగన్‌ను భూతంగా అభివర్ణించిన డిఎల్

DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి భూతంగా అభివర్ణించారు. మనలో మనం కలహించుకుంటే మా నాన్న పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఓ భూతం అంటుందని ఆయన తన సహచర మంత్రులను ఉద్దేశించి అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో ధర్నాలు చేయడం మంచిది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సహచర మంత్రులపై మంత్రులు మీడియాకు ఎక్కడం మంచిది కాదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని ఆయన అన్నారు. 108 సేవలపై తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అభిప్రాయభేదాలున్నాయని, అయినా తాను మీడియాకు ఎక్కడం లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న మంత్రి శంకరరావు, తెలంగాణ కోసం ధర్నా చేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడినట్లు అనిపిస్తోంది. అంతర్గతంగా పరిష్కరించుకోవడం వీలు కాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేరని ఆయన చెప్పారు. కొడితే తెలంగాణ వస్తుందనుకోవడం భ్రమ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపై గట్టిగా పోరాడుతున్నారని, ముఖ్యమంత్రికి నైతిక మద్దతు అవసరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+