ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, జూలకంటి రాజీనామాకు పట్టు

NTR Statue
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పట్టణంలోని శ్రీరాంపురంలో దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు రహదారి పైకి వచ్చి ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

తెలంగాణ ఏర్పడే వరకు తాము సమ్మె చేస్తామని ఆర్టీసి ఐకాస ప్రకటించింది. అన్ని డిపోల్లో బస్సులు నిలిచి పోయాయని చెప్పారు. సమ్మె నుండి వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ నెల 19న ప్రారంభమైన ఆర్టీసి సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఆర్టీఏ కార్యాలయంలో తెలంగాణవాదులు విధులను బహిష్కరించారు. కమిషనర్ తాఖీదులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. న్యాయవాదుల సమ్మె కారణంగా డిజిపి కేసు వచ్చే నెల 3వ తారీఖుకు వాయిదా పడింది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని లేదంటే బయట తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. మహబూబ్ నగర్ పోలేపల్లి సెజ్ లో 48 గంటల బందుకు పిలుపునిచ్చిన పాలమూరు లేబర్ సంఘం, మహబూబ్ నగర్ జిల్లాలో పోలేపల్లి సెజ్‌లో 48 గంటల పాటు బందుకు పాలమూరు లేబర్ సంఘం పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+